కాఫీ తోటల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలి: ఉద్యానవన అధికారిణి అరుణ కుమారి
గూడెం కొత్తవీధి, పెన్ పవర్, మే 26:కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి మండల ఉద్యాన అధికారిణి అరుణకుమారి తెలిపారు. మండలంలోని రింతాడ పంచాయతీ కడుగుల గ్రామంలో మంగళవారం కాఫీ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ మొక్కలను నాటినప్పటి నుంచి ఫలసాయం వచ్చే వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే కాఫీ బోర్డు సిబ్బంది అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో...