కేబుల్ వైర్ చోరీ కేసులో నలుగురు అరెస్ట్
నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీ షణ్ముఖ నగర్ లో జరిగిన వెయ్యి మీటర్ల కేబుల్ చోరీ కేసును పోలీసులు చేదించారు. మెయిల్ సోలార్ ఆఫీసులో వెయ్యి మీటర్ల కేబుల్ వైర్ దొంగిలించారన్న ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ముద్దాయిలను గాజువాకలో పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి పి. శ్రీనివాసరావు మీడియాకు వివరించారు....