కొత్త మల్లంపేటలో సీతారాముల విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్పీకర్
నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లిజిల్లా, గొలుగొండ మండలం, కొత్తమల్లంపేటలో బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణ స్వామి వార్ల శిలా విగ్రహ మరియు పసిడి కలశ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా స్పీకర్‌కు వేద పండితులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అయ్యన్నపాత్రుడుకు ఆశీర్వచనాలు అందజేసి...