గంజాయి త్రాగితే జైలుకే …
అడ్డతీగల, మే 30: శనివారం అడ్డతీగల సర్కిల్ కార్యాలయంలో అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. గజేంద్ర కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి త్రాగే వారిని అదుపు చేసే కొత్త పద్ధతి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్నారని సిఐ తెలిపారు. బయో చెక్ అనే రాపిడ్ కిట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆరు నెలల క్రితం గంజాయి త్రాగిన వ్యక్తిని కూడా గుర్తించొచ్చు అని ఈ కిట్టులో సదరు వ్యక్తి మూత్రము ఒక చుక్క వేసినట్లయితే అతను గంజాయి త్రాగే వ్యక్తి అయితే...