గిరిజనేతర నిర్వాసితులకు ఐటిడిఏ చింతూరు కీలక సూచనలు

ఆప్షన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి గడువు చింతూరు, పెన్ పవర్, మే 14: పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు, కూనవరం మండలాలకు చెందిన 1వ, 2వ డ్రాఫ్ట్ పథకాలలో ఉన్న గిరిజనేతర ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఐటిడిఏ చింతూరు కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పునరావాసానికి సంబంధించిన ఆప్షన్ ఫారమ్ సమర్పించని కుటుంబాలు రేపటిలోగా తప్పనిసరిగా తమ ఫారమ్‌లను సమర్పించాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని తాడువాయి గ్రామంలో ప్లాట్లు ఎంపిక చేసుకున్న గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు...