గుక్కెడు మంచినీటి కోసం ఒంటితాడి ప్రజల ఆర్తనాదం

“మహాప్రభో... తాగేందుకు నీళ్లు ఇప్పించండి” అంటూ గ్రామస్తుల వేడికోలు ఎండలు మండుతున్నా స్పందించని అధికారులు.. కలుషిత నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్న మహిళలు ప్రత్యేక కథనం బైలైన్: దడాల ఏడుకొండలు – పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, కాకినాడ జిల్లా కాజులూరు, మే 21 (పెన్ పవర్): ఒకవైపు భానుడు భగభగమంటూ మండిపోతుంటే... మరోవైపు గుక్కెడు మంచినీటి కోసం కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఒంటితాడి, శీలలంక గ్రామాల ప్రజలు కటకటలాడుతున్నారు. రక్షిత మంచినీటి పథకం ఉన్నా, పైపులు ఉన్నా, అధికారులు ఉన్నా... గ్రామస్తుల దాహార్తి...