గొల్లపాలెంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి … భారీ ర్యాలీ

కాజులూరు, పెన్ పవర్ మే 1: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మి పేట గ్రామంలో మేడే పండుగను పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. “అంబేద్కర్ అందరివాడు” అనే సందేశాన్ని ప్రధానంగా ఉంచుకుని కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పెనుమల్ల సుధీర్ హాజరై అంబేద్కర్ జీవితం, ఆశయాలపై సవివరంగా ప్రసంగించారు. బాల్య దశలో ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్షలను వివరించి, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. సమసమాజ నిర్మాణం కోసం మానవత్వం...