గొల్లపాలెం హైస్కూల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన
క్రీడాకారులకు ప్రోత్సాహంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ సందర్శనం కాజులూరు, పెన్ పవర్,మే15: కాకినాడ జిల్లా గొల్లపాలెం హైస్కూల్‌లో మే 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన లభిస్తోంది.సాఫ్ట్‌బాల్,వాలీబాల్,రైఫిల్ షూటింగ్ విభాగాల్లో యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్,సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ సందర్శించి క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా...