గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి

కందులపాలెంలో రూ.30 లక్షలతో కల్వర్టుకు శంకుస్థాపన రామచంద్రపురం, పెన్ పవర్,మే 4: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నదని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్య మవుతుందని తెలిపారు. రహదారులు, కాల్వలు, కల్వర్టులు...