ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

చింతూరు, పెన్ పవర్, మే 11: కూనవరం మండలం అభిచర్ల గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, చింతూరు నుంచి కూనవరం వైపు కాంకర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పంద్రాజుపల్లి గ్రామానికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరు గ్రామానికి చెందిన పద్ధం కార్తీక్ (25) ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో యువకుడు అభిచర్ల...