చింతూరు గ్రామంలో కుక్కల సమస్యపై దళిత నాయకుల ఆందోళన
చింతూరు, పెన్ పవర్, మే 2: చింతూరు గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై దళిత నాయకులు నాగేంద్ర మరియు కుమార్ గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, వాడబజార్, సినిమా హాల్ సెంటర్, మెడికల్ కాలనీ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లలు, పశువులు, కోళ్లు మరియు రహదారులపై వెళ్లే ప్రజలపై దాడులు చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు....