చింతూరు మండలంలో ఫేజ్ 1బి డ్రాఫ్ట్ స్కీమ్స్ విడుదల

చింతూరు, పెన్ పవర్ మే 4: చింతూరు మండలానికి సంబంధించిన ఫేజ్–1బి సప్లిమెంటరీ డ్రాఫ్ట్ స్కీమ్స్‌ను ఐ.టి.డి.ఏ., చింతూరు డివిజన్ అధికారులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో 41.15 కాంటూర్ స్థాయి కింద ప్రభావితమైన ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్ ) చర్యల భాగంగా ఈ స్కీమ్స్ రూపొందించబడినట్లు తెలిపారు. ఈ స్కీమ్స్‌లో చింతూరు, మల్లేతోట, ఏ.జి. కొడేరు, ఉల్లుమూరు, చూటూరు గ్రామాలకు చెందిన ఎస్.టి మరియు నాన్ ఎస్.టి నిర్వాసిత కుటుంబాల...