జక్కన రాజేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తోట
కాజులూరు, పెన్ పవర్, మే 1: గుండె సంబంధ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బంధనపూడి మాజీ సర్పంచ్, సీనియర్ రాజకీయ నాయకులు జక్కన రాజేష్ ను శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు.వైయస్సార్సీపీ రాష్ట్రస్థాయి నాయకులైన తోట త్రిమూర్తులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న జెక్కన రాజేష్‌ను ఆయన స్వగృహానికి వెళ్లి కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు,...