డాక్టర్ డేగల నాగేంద్ర ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రమాణ స్వీకారం

కాజులూరు, పెన్ పవర్, మే1: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం శివాలయం ప్రాంగణంలో శుక్రవారం కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై డాక్టర్ డేగల నాగేంద్ర ప్రధాన అతిథిగా హాజరై, తన ఆధ్వర్యంలో సభ్యులతో ప్రమాణ పత్రం (రి.నెం: 101/2026) చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆలయ ప్రాంగణంలో సమిష్టిగా ప్రమాణ పత్రాన్ని చదివి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం సభ్యులందరినీ డాక్టర్ నాగేంద్ర శాలువాలు,...