డీసీఎం వ్యాన్ దగ్ధం

డ్రైవర్, క్లీనర్ సురక్షితం. కేసు నమోదు చింతూరు, పెన్ పవర్, మే 19: బొడ్డుగూడెం గ్రామం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున డీసీఎం వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అర్జుని డొంగార రావు డ్రైవర్‌గా, సుదిమా ఠాకూర్ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా ఐఎఫ్‌జీఎల్ రిఫ్రాక్టరీ సంస్థకు ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా ఐఎఫ్‌జీఎల్ రిఫ్రాక్టరీస్...