దివికేగిన ధృవతారకు అశ్రునివాళి

కాజులూరు, పెన్ పవర్, మే 27ః మండల పరిధిలోని పొలమూరుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పంతగడ అప్పారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ సామాజిక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన ఆయన మృతి పలువురిని కలచివేసింది. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, దేవాదాయ, ధర్మాదాయ భూములను దళితులకు అంకితం చేయాలని గళమెత్తిన ఉద్యమకారుడిగా పంతగడ అప్పారావు ప్రత్యేక గుర్తింపు పొందారు....