PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 8:55 pm Posted By : M CHANTI BABU

దుచ్చరపాలెంలో విరబూసిన బ్రహ్మ కమలం

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ దుచ్చరపాలెం గ్రామంలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు విరబూసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సాగిన లక్ష్మణరావు నివాస గృహంలో ఈ పుష్పాలు వికసించాయి.రాత్రివేళల్లో తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.