నర్సీపట్నంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి

నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, విద్యుత్ తదితర సమస్యలపై 12 వినతులు వచ్చాయని తెలిపారు. వచ్చిన సమస్యలన్నిటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...