నర్సీపట్నంలో తృప్తి క్యాంటీన్ ప్రారంభించిన స్పీకర్

నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తృప్తి క్యాంటీన్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా 750 క్యాంటీన్లను మంజూరు చేయగా, అనకాపల్లి జిల్లాలో మొదటి క్యాంటీన్ ఇదేనని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ క్యాంటీన్ కు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 13.75 లక్షలు లోన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ క్యాంటీన్ ను...