నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ముసాయిదా విడుదల

నర్సీపట్నం, పెన్ పవర్ :  నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదాను సోమవారం ఉదయం మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో 28 వార్డుల నుండి 40 వార్డులకు పెంచుతూ ముసాయిదానం తయారు చేశారు. దీనిని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టిపిఓ సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ముసాయిదాయపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న వారం రోజుల్లోగా అధికారులకు తెలియజేయాలని కోరారు.