నిండు గర్భిణికి 2 కిలోమీటర్లు కుర్చీలో మోస్తూ తరలింపు 

ఐదు ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కాలయాపన చేస్తున్న అధికారులు. గర్భిణీ స్త్రీ సుందరమ్మకు కుర్చీలో మోస్తూ గేదెలబంద జంక్షన్ తీసుకొచ్చిన వైనం. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల కరిముఖిపుట్టు పంచాయతీ, బరెంగుల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ వంతాల సుందరమ్మకు నెలలు నిండడంతో రహదారి సౌకర్యం లేక కుర్చీలో మోస్తూ సుమారు రెండు కిలోమీటర్ల వరకు తరలించి తరువాత 108 వాహనముతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల ప్రకారం.....