నూతన పోలవరం జిల్లాలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి

  రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 12: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో జిల్లా ప్రధాన కేంద్రంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక అధ్యక్షుడు బోండ్ల వర ప్రసాద్ రావు జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అప్పటి ప్రాజెక్టు అధికారి మ్యూజియం ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలిపారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు...