PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:26 pm Posted By : SIVA KUMAR LANKA

పట్నాల శ్రీను కుటుంబానికి అన్నపూర్ణ సేవా సంఘం ఆర్థిక సాయం

నర్సీపట్నం, పెన్ పవర్ :

మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాలు శీను ప్రమాదవశాత్తు మంచాన పడిన విషయం తెలిసిందే. శ్రీను పైనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దాతలు, ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నర్సీపట్నంలో అన్నపూర్ణ సేవా సంఘం సభ్యులు మరియు వారి మిత్రులు కలిసి 16,500/- లు, 5 చీరలు ఆ కుటుంబానికి సాయంగా అందించారు.