పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం
నర్సీపట్నం, పెన్ పవర్: పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధిలో భాగంగా పంట కాలువ పూడికతీత, చెరువుగట్టుపై జంగిల్ క్లియరెన్స్, రెండు గేట్ల ఏర్పాటు పనులను రూ. 6.5 లక్షల నిధులతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ బంగ్లా ముందు కల్వర్టు పనులు అవుతున్నాయని అదేవిధంగా జోగినాథపాలెంలో కల్వర్ట్ పనులను...