పెద్ద సాయం చేసిన సాయం పది రూపాయలు సంస్థ
నర్సీపట్నం, పెన్ పవర్: మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితమవడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు "సాయం 10 రూపాయలు" స్వచ్ఛంద సంస్థ సభ్యులు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సేకరించిన విరాళాల మొత్తంగా రూ.18,40,000లను శనివారం పట్నాల శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాజం అండగా...