పేకాట శిబిరంపై దాడి: 10 మంది అరెస్ట్

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : ఎడ్లపాడు: గ్రామ శివారు ప్రాంతంలో జరుగుతున్న జూద కార్యకలాపాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 5,100/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ప్రజలెవరూ ఇటువంటి జూద వ్యసనాలకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు.