పొల్లూరు జలపాతంలో విషాదం. యువకుడు మృతి
చింతూరు, పెన్ పవర్, మే 21: మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతుగూడెం పంచాయతీకి చెందిన పొల్లూరు జలపాతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం లోని గైడ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు స్నేహితులు విహార యాత్ర నిమిత్తం పొల్లూరు జలపాత ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిలో ఒకరైన ఎం. మోజెస్ (21), స్వస్థలం భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, ప్రమాదవశాత్తు జలపాతంలోని నీటిలో మునిగి మృతి చెందినట్లు మోతుగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ నస్సిర్ హుసైన్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...