పోలవరం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు రెడ్డి
గంగవరం, మే 4: పోలవరం జిల్లాలోని రెవిన్యూ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో గంగవరం మండలం రెవిన్యూ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా సేవలందిస్తున్న కె. వెంకటేశ్వర్లు రెడ్డి ని సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే సంఘ కార్యదర్శిగా వి.ఎస్. సత్యనారాయణ, కోశాధికారిగా ఎ. విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వ బృందాన్ని సంఘ సభ్యులు హర్షధ్వానాలతో అభినందించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పనిచేస్తున్న...