పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల లాటరీ 21న
చింతూరు, పెన్ పవర్, మే 18: పోలవరం బహుళ ప్రయోజన సేద్యపునీటి ప్రాజెక్టు ఫేజ్–1బి పరిధిలో ప్రభావితమవుతున్న చింతూరు గ్రామ గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ నెల 21న లాటరీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐటిడిఏ చింతూరు ప్రాజెక్టు అధికారి తెలిపారు. చింతూరు మండలంలోని చింతూరు గ్రామ ప్రజలకు సమగ్ర పునరావాసం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో అభివృద్ధి చేస్తున్న తాడువాయి...