ప్రజలకు ఉపయోగపడేదే నిజమైన అభివృద్ధి : ప్రత్తిపాటి

జనం అడిగింది చేయడంతో సరిపెట్టకుండా... అభివృద్ధిపై వారి సంతృప్తిని తెలుసుకోండి. మున్సిపల్ కమిషనర్ సహా, కిందిస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో చిలకలూరిపేట ఉన్నత స్థానంలో ఉండాలి. ప్రధాన చెరువు కట్టల్ని బలోపేతం చేసి వాకింగ్ ట్రాక్ లు నిర్మించండి. స్టేడియం, ఆడిటోరియం నిర్మాణ అంచనాలు సిద్ధం చేయండి. శ్మశానవాటికల్ని సకల హంగులతో మోడల్ పార్కుల్లా మార్చాలి. శివారు ప్రాంత సమస్యలపై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పట్టణంలో అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించిన...