ప్రజల సహకారంతో అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ నిషాంతి.టి
స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర’ (SA-SA) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిషాంతి టి తెలిపారు. శనివారం పాడేరు మండలం కిండంగి గ్రామంలో తడి, పొడి చెత్తతో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం వీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు,...