ప్రజా దర్బార్‌లో అర్జీల పరిష్కారమే లక్ష్యం

ఎమ్మెల్యే శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, మే 29: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి నివేదిక అందించాలని...