ప్రతిభవంతునికి ఘన సత్కారం…

పుల్లల చెరువు పెన్ పవర్ మే 2 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటిన పుల్లలచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి తక్కెళ్ల పవన్ కుమార్‌ను ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, విద్యాశాఖాధికారులు ఘనంగా అభినందించి సత్కరించారు. విద్యార్థి విజయాన్ని కొనియాడుతూ అధికారులు ఆయనకు శాలువా కప్పి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేసి ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పవన్ కుమార్ మరోసారి నిరూపించాడని...