ఫోటో కోసం హైవే ఎక్కి ప్రాణాలు కోల్పోయిన ఉపాధి కూలీలు
కాకినాడ కొవ్వూరు బ్రిడ్జి వద్ద విషాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు మృతి కన్నీటి పర్యంతమైన చీడిగ గ్రామం.. ఇద్దరి పరిస్థితి విషమం కాకినాడ, పెన్ పవర్ మే 16ః ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల జీవితాల్లో శనివారం ఉదయం ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఫోటో తీసుకునేందుకు హైవే రోడ్డుపైకి వెళ్లిన కూలీలపై వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి...