బ్రేకులు ఫెయిలై జీపు బోల్తా… పలువురికి గాయాలు

జి.మాడుగుల,పెన్ పవర్, మే (06)జి.మాడుగుల మండలం, జాతీయ రహదారి 516-ఈ వంజరి ఘాట్ మార్గంలో ములక్కాయపుట్టు గ్రామ సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జి.మాడుగుల నుంచి ప్రయాణికులతో తాజంగి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాన్ని అదుపుచేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికి వాహనం ఆగకపోవడంతో పక్కనున్న మట్టి రోడ్ వైపు వాహనాన్ని మళ్ళించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది....