యువతకు స్ఫూర్తిగా సీఆర్పీఎఫ్ పరిశుభ్రత కార్యక్రమం
చింతూరు, పెన్ పవర్, మే 22: ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎ/నలభై రెండు బెటాలియన్ సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మోతుగూడెం పిక్నిక్ స్పాట్‌లో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొని ప్రదేశమంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర చెత్తను తొలగించారు. పిక్నిక్ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచిన అనంతరం అక్కడి సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, యువత కలిసి...