రక్తదానం చెయ్యండి, నిండు ప్రాణాన్ని కాపాడండి
రక్తదానం చెయ్యండి నిండు ప్రాణాన్ని కాపాడండి -స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడిన రక్త నిల్వల కొరతను అధిగమించేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం 20 బ్లడ్ ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మే, జూన్ నెలల్లో తక్షణమే 200 నుంచి 250 బ్యాగుల రక్తాన్ని...