రెండో రోజు ఉత్సాహంగా సాగిన ఆదివాసి రేలా ఉత్సవాలు

సాంప్రదాయ నృత్యాలు చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన రంపచోడవరం ఆకట్టుకుంటున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గిరిజనల డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 26 : పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసి రేలా ఉత్సవాలు రెండో రోజు సోమవారం సాయంత్రం అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగాయి. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి...