లంకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం – 200 మందికి సేవలు
సీతానగరం, పెన్ పవర్ మే 4: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.శిబిరంలో డా. శ్రీనివాస్ రాయుడు, డా. సత్యం రమేష్ బాబు పాల్గొని సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వీరిలో 78 మందికి రక్త పరీక్షలు, 4 మందికి థైరాయిడ్ పరీక్షలు...