వరి కంకులు దహనం చేస్తూ అగ్ని ప్రమాదం
అండ్రంగిలో మంటలతో ఉలిక్కిపడ్డ రైతులు.. ధాన్య రాశులకు తృటిలో తప్పిన ముప్పు కాజులూరు, పెన్ పవర్,మే 22: కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని అండ్రంగి గ్రామంలో వరి చేలల్లో గడ్డి, కంకులు తగలబెట్టడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుని గ్రామ రైతులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. మంటలు వేగంగా వ్యాపించి గడ్డి మేట్లు, చెట్లను అంటుకోవడంతో సమీపంలో ఉన్న ధాన్య రాశులకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కొందరు రైతులు నిర్లక్ష్యంగా చేలల్లో వరి కంకులు,గడ్డి...