వాడపాలెంలో కలకలం.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..
ఇంటిలోకి దూసుకెళ్లిన ధాన్యం ట్రాక్టర్ కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో శనివారం మధ్యాహ్నం తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నేరుగా ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.చెయ్యేరు ప్రాంతం నుంచి ఈతకోట రైస్‌మిల్లుకు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాడపాలెం గ్రామానికి చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే...