వైఎస్ఆర్ పార్టీ డిజిటలైజేషన్‌పై రాష్ట్ర కార్యదర్శులతో చిర్ల జగ్గిరెడ్డి సమీక్ష

పెన్ పవర్ మే 16 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. రావులపాలెం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ డిజిటలైజేషన్ కార్యక్రమాలు, వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా వేగవంతంగా అమలు చేసే అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి...