శని జయంతి సందర్భంగా మందపల్లి దేవస్థానానికి భారీ ఆదాయం

కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు, హోమాలు, జపాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఈ సందర్భంగా ఆలయానికి వివిధ పూజా సేవల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. ముఖమండప సేవల ద్వారా రూ.1,30,200, ఏకాదశ రుద్ర తైలాభిషేకాల ద్వారా రూ.3,89,500, మహాన్యాస...