శ్రీకాళహస్తిలో జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ ప్రత్యేక పూజలు
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10: చిలకలూరిపేట: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుల సందడి నెలకొంది. నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత, ప్రముఖ సేవా దృక్పథం కలిగిన ప్రదాత మండలనేని చరణ్ తేజ ఆదివారం శ్రీకాళహస్తిని సందర్శించారు. వీరితో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, జనసేన ముఖ్య నేతలు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం...