సూరేపల్లి లో ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యకమం
భట్టిప్రోలు, పెన్ పవర్,మే, 13: మండలంలోని సూరేపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మరెడ్డి అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యకమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మధు మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మధుమోహన్ మాట్లాడుతూ,ప్రతీ ఒక్కరూ రసాయన ఎరువుల,పురుగు మందుల వాడకం క్రమంగా తగ్గించుకుంటూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు ఆర్జించ వచ్చని,దానికి నిబద్దత మరియు ప్రకృతి పట్ల విచక్షణ ఉండాలని...