స్థానిక ఎన్నికల్లోనూ 100శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి:జనసేన నాయకులకు డాక్టర్ వంపూరు గంగులయ్య పిలుపు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,మే 29: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్‌ను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు....