స్పీకర్ చేతుల మీదుగా క్రీడా సామగ్రి పంపిణీ

నర్సీపట్నం, పెన్ పవర్: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు వచ్చిన క్రీడా సామగ్రిని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాంప్ కోచ్‌లు, విద్యార్థులకు పంపిణీ చేశారు. అనకాపల్లి స్పోర్ట్స్ అథారిటీ నుంచి డీఎస్‌డీఓ పూజారి శైలజ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ల కోసం బాక్సింగ్, ఉషూ, జూడో, వాలీబాల్ తదితర క్రీడలకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న సాకిరెడ్డి హరిణి జాతీయ స్థాయి బాక్సింగ్‌లో ప్రతిభ...