స్వర్ణ గ్రామంగా ప్రకటించిన ప్రాంతంలోనే రోడ్డెక్కిన రైతులు

  మద్దతు ధర కల్పించాలని వానపల్లి రైతుల ఆందోళన కొత్తపేట, పెన్ పవర్, మే 16: కొత్తపేట మండలం వానపల్లి కోఆపరేటివ్ బ్యాంకు వద్ద రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా, దళారీలు కేవలం రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో క్వింటాల్‌కు సుమారు రూ.700 వరకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరలకు పంట అమ్ముకోవాల్సి రావడంతో...