బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.. సమాజంలో తమ హక్కులను తెలుసుకోవాలి”
“ – సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి గంగవరం, పెన్ పవర్, మే 23 : “ప్రతి బాలిక తన ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై అవగాహన కలిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో జీవితాన్ని నిర్మించుకోవాలి” అని గంగవరం సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి అన్నారు.గంగవరం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సీత, ఎంఎస్‌కే సభ్యులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత,...