గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

  రంపచోడవరం, పెన్ పవర్, మే 23 : “స్వామివారిపై అచంచల భక్తి, విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి” అన్న నమ్మకంతో శనివారం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రంపచోడవరం సమీపంలోని పోలవరంలో నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను...